విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా చర్యల లోపం కారణంగా ఐదేళ్ల చిన్నారి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో తీవ్ర విషాదాన్ని నింపింది.
కాలనీలో నివసిస్తున్న చల్లా ఏసుబాబు, నాగలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె మాధవి (5) గురువారం సాయంత్రం ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్లింది. 224 బ్లాక్ సమీపంలోని మెట్ల వద్ద ఉన్న విద్యుత్ మీటర్ బాక్సులు తెరిచి ఉండగా.. చిన్నారి తెలియక వాటిని తాకింది. వెంటనే విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.స్థానికులు గమనించి బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికులు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ బాక్సులను సరైన రీతిలో మూసివేయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు చిన్నారి మృతిపై స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















