విశాఖ జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కొత్తవలసకు చెందిన మల్లా వినోద్ కుమార్ కొంతకాలంగా పెందుర్తిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన వినోద్ కుమార్.. రాత్రి సమయంలో తన కుటుంబ సభ్యులకు సెల్‌ఫోన్ ద్వారా ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం.
అనంతరం వినోద్ కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా.. అతని భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు విషపదార్థం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాఖీ పండుగ రోజున సంతోషంగా గడిపిన కుటుంబంలో కొద్దిగంటల్లోనే చోటుచేసుకున్న ఈ విషాదం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు లేదా ఇతర కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















