ఐపీఎల్‌లో కొత్త సంచలనం వెలుగులోకి వచ్చాడు. బ్యాటర్ కాదు, తన పేస్ బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన యువ బౌలర్ ప్రఫుల్ హింగే అందరి దృష్టిని ఆకర్షించాడు.తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబరిచి తొలి ఓవర్‌లోనే మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును షాక్‌కు గురి చేశాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీని తొలి బంతికే ఔట్ చేయడం ఈ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చివరికి నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ప్రఫుల్ హింగే తన ప్రదర్శనపై మాట్లాడుతూ, తన అరంగేట్రం ఎలా ఉండాలో గత ఏడాదే నిర్ణయించుకున్నానని తెలిపాడు. మొదటి మ్యాచ్‌లోనే 4 లేదా 5 వికెట్లు తీసి పవర్‌ప్లేలో బ్యాటర్లపై ఆధిపత్యం చూపాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగినట్లు వెల్లడించాడు.కేవలం 13 ఏళ్ల వయసులోనే క్రికెట్ ప్రారంభించిన ఆయన, మొదట లెదర్ బాల్ క్రికెట్ కూడా తెలియదని చెప్పారు. కుటుంబ ప్రోత్సాహంతో క్లబ్ క్రికెట్‌లో చేరి క్రమంగా ఎదిగి ఈ స్థాయికి వచ్చానని వివరించాడు.
తాను తీసిన నాలుగు వికెట్లలో వైభవ్ సూర్యవంశీ వికెట్ తనకు అత్యంత ప్రత్యేకమని ప్రఫుల్ తెలిపాడు. అతడిని తొలి బంతికే ఔట్ చేస్తానని ముందే సన్నిహితులకు చెప్పినట్లు కూడా వెల్లడించాడు.ఎంఆర్‌ఎఫ్ ఫౌండేషన్, తన బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్, ఫిజియో నవీన్ సార్ సహకారంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నాడు. విదర్భకు చెందిన ఈ 24 ఏళ్ల పేసర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















