మదనపల్లెలో గంజాయి మత్తులో జరిగిన దారుణ ఘటన ఇంకా ప్రజల మదిలో నుంచి మాయంకాలేదు. ఆ సంఘటనకు ముందే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రేణిగుంట పట్టణంలో గంజాయి మత్తులో ఓ వ్యక్తి నడి రోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించాడు.
తనను తాను గాయపరుచుకుంటూ రోడ్డుమీద ఆగ్రహంగా ప్రవర్తించిన ఆ వ్యక్తి చర్యలతో వాహనదారులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొంతసేపు ట్రాఫిక్ కూడా స్తంభించింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం.
గంజాయి వినియోగం పెరుగుతుండటంతో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















