రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకులు మూసివేయబడుతున్న పరిస్థితిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించి పరిస్థితిని అంచనా వేశారు.
సమస్యను వెంటనే పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తూ, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
అలాగే పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో చర్చలు జరిపి సరఫరా సమస్యలను త్వరగా పరిష్కరించాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంధన సరఫరా సక్రమంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఇంధన కొరతపై వస్తున్న ప్రచారాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందకుండా, అవసరానికి తగ్గట్టే వినియోగించుకోవాలని కూడా సీఎం సూచించినట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















