ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్నందున మన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్లేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వేసవిలో శరీరం త్వరగా నీరసం చెందే అవకాశం ఉంటుంది.
ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేని వారు, డీహైడ్రేషన్‌కు గురి కానివారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నడవవచ్చు. అయితే ఇది అందరికీ సరికాదు. వాకింగ్ తర్వాత ఎక్కువగా అలసటగా లేదా నీరసంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
జాగ్రత్త
మధుమేహం ఉన్నవారు ఖాళీ కడుపుతో వాకింగ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా తగ్గి తల తిరగడం, నీరసం వంటి సమస్యలు రావచ్చు. అలాంటి వారు ఉదయాన్నే తేలికపాటి ఆహారం తీసుకుని వాకింగ్‌కు వెళ్లడం మంచిది. ఉదాహరణకు నానబెట్టిన శనగలు వంటి ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవచ్చు.
వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. దీని వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. తలనొప్పి, అలసట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వాకింగ్‌కు వెళ్లే ముందు తగినంత నీరు తాగడం చాలా అవసరం. అలాగే ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య నడకకు వెళ్లడం మంచిది. ఆ తర్వాత సూర్యుడి వేడి పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















