తెలంగాణలో పాఠశాల విద్యలోకి ఇంటర్‌మీడియట్ విద్యను విలీనం చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. స్కూల్, ఇంటర్ విద్యకు ఒకే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ఇందుకు సంబంధించి నేడో రేపో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న తెలంగాణ విద్యా చట్టం-1982ను సవరించడంతో పాటు, తెలంగాణ ఇంటర్‌మీడియట్ విద్యా చట్టం-1971ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్‌ఎస్‌సీ బోర్డు, ఇంటర్ బోర్డును కలిపి ‘తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్‌ఈబీ)’గా ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయనున్నారు.
ఈ విలీనంతో పదో తరగతి తర్వాత చదువు మానేస్తున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఇది ఉపయోగపడుతుందని చెబుతోంది. అలాగే సమగ్ర శిక్ష, పీఎం శ్రీ వంటి కేంద్ర పథకాల నిధులు మరింతగా పొందే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
స్కూల్‌లు, జూనియర్ కళాశాలల మధ్య వనరుల వినియోగం మెరుగుపడటంతో పాటు ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, మౌలిక సదుపాయాలను సమర్థంగా ఉపయోగించుకునే వీలుంటుందని ప్రభుత్వం
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















