ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండడం, అలాగే ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే అంశంలో ఉన్న సాంకేతిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగకుండా వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలని సీఎం సూచించారు.
ఇంటర్మీడియట్‌ను రద్దుచేసి 11, 12 తరగతులుగా మార్చాలని Telangana Education Commission ప్రభుత్వానికి సూచించింది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని కమిషన్ పేర్కొంది.ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ కళాశాలలకు వెళ్లకుండా చదువు మధ్యలోనే ఆపేస్తున్న పరిస్థితిపై కూడా చర్చ జరిగింది. డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు 11, 12 తరగతుల విధానం ఉపయోగపడుతుందని కమిషన్ అభిప్రాయపడింది.
ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ Vem Narender Reddy, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా తదితరులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఇంటర్మీడియట్ విలీన ప్రక్రియలో ఉన్న పలు సాంకేతిక సమస్యలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు జరిపి నివేదిక సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.అనంతరం తెలంగాణ విద్యా విధాన కమిటీ నివేదికను పరిశీలించి, శాసనసభలో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















