Indiaలో భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శుక్రవారం ఉదయం నమోదైన ఉష్ణోగ్రతల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉన్న టాప్-50 నగరాలన్నీ భారత్‌లోనే ఉన్నట్లు AQI.in వెల్లడించింది.
ఒడిశాలోని Balangirలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహారాష్ట్రలోని చంద్రాపుర్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ తీవ్రమైన ఎండలు నమోదవుతున్నాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి, బాందా, బరేలీ, అయోధ్య వంటి నగరాలు కూడా తీవ్ర వేడి ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. వాయువ్య, మధ్య భారతదేశంలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని India Meteorological Department ఇప్పటికే హెచ్చరించింది. పలు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు కూడా జారీ చేసింది.
ఈ ఎండల కారణంగా ఆసుపత్రుల్లో డీహైడ్రేషన్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బయట పనులు చేసే వారు, చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని తెలిపారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావొద్దని, ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















