తిరుమల తిరుపతి దేవస్థానాల ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. శ్రీవారి ఖాతాలను మరింత పారదర్శకంగా, పటిష్ఠంగా, ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు కొత్త అకౌంటింగ్ మాన్యువల్‌ను రూపొందించనున్నారు. ఈ బాధ్యతను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చేపట్టింది.
తితిదే అధికారులు, ఐసీఏఐ ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ప్రాజెక్టు పరిధిని కూడా ఇరు పక్షాలు ఖరారు చేశాయి. ఐసీఏఐకి చెందిన అకౌంటింగ్ రీసెర్చ్ ఫౌండేషన్ (ARF) నిపుణుల బృందం ఆగస్టు మొదటి వారంలో తిరుపతికి చేరుకుని తితిదే ఖాతాల నిర్వహణ విధానంపై క్షేత్రస్థాయి అధ్యయనం చేయనుంది.
ప్రస్తుతం తితిదే వినియోగిస్తున్న అకౌంటింగ్ మాన్యువల్ సుమారు 30 ఏళ్ల క్రితం రూపొందించబడింది. ఈ కాలంలో ఆడిటింగ్ విధానాలు, డిజిటల్ సాంకేతికత, అకౌంటింగ్ ప్రమాణాల్లో అనేక మార్పులు వచ్చాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కొత్త మాన్యువల్‌ను రూపొందించనున్నారు. ట్రయల్ బ్యాలెన్స్, ఇతర ఖాతాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని నిపుణుల బృందం సేకరించనుంది.
అవసరమైతే తితిదే ఆర్థిక నియమావళిలో మార్పులు చేయడానికి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలను కూడా నిపుణులు రూపొందించనున్నారు. ఈ సంస్కరణలు పూర్తయితే తితిదే అకౌంటింగ్ విధానం దేశంలోని ఇతర ప్రముఖ ఆలయాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















