వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1ను సీఎం చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రాజెక్టు కోసం సుదీర్ఘకాలం పోరాడిన పూల సుబ్బయ్య కుటుంబాన్ని ప్రత్యేకంగా సత్కరించారు. పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందనలను సీఎం చంద్రబాబు శాలువాలతో సన్మానించారు.
వెలిగొండ ప్రాజెక్టు పూర్తవడం తమ కుటుంబానికి ఎంతో భావోద్వేగమైన సందర్భమని పూల సుబ్బయ్య కుమార్తెలు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తవుతుందని, దాన్ని కళ్లారా చూస్తామని తాము ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. తమ తండ్రి ఎన్నో ఏళ్లుగా పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలనే లక్ష్యంతో పోరాడారని గుర్తుచేశారు.
తమ తండ్రి పూల సుబ్బయ్యను, సీఎం చంద్రబాబును మార్కాపురం జిల్లా ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరని విలాసిని అన్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య కుమార్తెలు సీఎం చంద్రబాబు కాళ్లకు నమస్కరించారు. తమ కుటుంబం తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
1929 జూన్ 29న కంభంలో జన్మించిన పూల సుబ్బయ్య ఉపాధ్యాయుడిగా, న్యాయవాదిగా పనిచేస్తూనే ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారు. రాజకీయాల్లోనూ ప్రజల తరఫున తన గళాన్ని బలంగా వినిపించారు. 1962, 1967లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి, 1978లో మార్కాపురం నుంచి సీపీఐ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
పశ్చిమ ప్రకాశం ప్రాంతం తరచూ కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కృష్ణా జలాలను ఈ ప్రాంతానికి తీసుకురావాలన్నది పూల సుబ్బయ్య ప్రధాన లక్ష్యంగా ఉండేది. ఇందుకోసం ప్రజలను సమీకరించి అనేక సంవత్సరాల పాటు ఉద్యమించారు. చట్టసభల్లోనూ పశ్చిమ ప్రకాశం నీటి సమస్యను ప్రస్తావిస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చారు.
పూల సుబ్బయ్య సాగించిన సుదీర్ఘ పోరాటానికి ప్రతీకగా వెలిగొండ ప్రాజెక్టును స్థానికులు భావిస్తున్నారు. ప్రాజెక్టు ఫేజ్-1 పూర్తై జాతికి అంకితం కావడంతో ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















