భారాస ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ఆ పార్టీ అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ టి.హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. ఇది భారాస ఎమ్మెల్యేలపై తీసుకున్న చర్య కాదని, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ అని ఆయన విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి కాదని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపించేందుకు ఉపయోగపడాలని అన్నారు.
మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఈ సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఒక్క సమస్యపైనైనా సమగ్రంగా చర్చ జరిగిందా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. కనీసం ఒక్క ప్రభుత్వ విధానంపైనైనా సమాధానం చెప్పారా అని నిలదీశారు. ప్రతిపక్షాన్ని వేధించడం, గొంతు నొక్కడం, సభ నుంచి బయటకు పంపించడం తప్ప ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేదని ఆరోపించారు.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను సభలో ప్రస్తావించాలని కోరుతూ భారాస ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందించారని హరీశ్‌రావు తెలిపారు. అలాంటి సమస్యలు శాసనసభలో చర్చకు వస్తాయనే భయంతోనే ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామిక చర్య అని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. అసెంబ్లీలో భారాస గొంతును అణిచివేయవచ్చేమో కానీ ప్రజాక్షేత్రంలో తమ పోరాటాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఎంతగా అణచివేస్తే అంతే బలంగా ప్రజల తరఫున భారాస పోరాడుతుందని హరీశ్‌రావు అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















