విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన సమీక్షించారు.
అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా ఇప్పటికే 25 లక్షల మంది వయోజనులు అక్షరాస్యులుగా మారినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అక్షరాస్యతను మరింత పెంచేందుకు ప్రతి అధికారి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 25 లక్షల మందిని, సెప్టెంబరు నాటికి మిగిలిన 27 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో బడి బయట ఉన్న 1,64,821 మంది పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఇప్పటికే 33 వేల మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఉపాధ్యాయులకు కృత్రిమ మేధస్సు సాధనాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు, విద్యా బోధనలో సాంకేతికతను మరింత సమర్థంగా వినియోగించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా పర్యవేక్షణ పెంచాలని స్పష్టం చేశారు.
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 125 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు, ప్రత్యేక శిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు 5న విజయవాడలో 192 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల హాజరు 98.97 శాతానికి పెరిగిందని వెల్లడించారు.
ఇక ఇంటర్మీడియట్ విద్యలోనూ గతేడాదితో పోలిస్తే 10 వేల ప్రవేశాలు పెరిగినట్లు అధికారులు మంత్రికి వివరించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యతను మరింత పెంచేలా నిరంతర సమీక్షలు, పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి లోకేశ్ సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















