అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
ఇదే అంశంపై కాంగ్రెస్ పాలనలో జరిగి ఉంటే దేశవ్యాప్తంగా రాద్ధాంతం చేసేవారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావును ఆయన ప్రశ్నించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, మోదీ, అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిధిలోనే అయోధ్య ట్రస్టు ఏర్పాటైందని గుర్తుచేశారు.
విరాళాల వ్యవహారంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశం కావడంతో పూర్తి పారదర్శకత అవసరమని జగ్గారెడ్డి అన్నారు.
అలాగే, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుతూ భారాస, కాంగ్రెస్ పాలనలపై కేటీఆర్‌తో చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. ప్రజల ముందు అన్ని విషయాలను చర్చించడానికి తాము వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















