తెలంగాణలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విద్య, పరిశోధన అవకాశాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో లండన్‌లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో భాగస్వామ్యం ఏర్పరచుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. సుమారు 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యావేత్తలతో రాష్ట్ర విద్యా రంగం, పరిశోధన, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలపై సమగ్రంగా చర్చించారు.
బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో సీఎం సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలను వెల్లడించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సహకరించాలని సీఎం కోరారు. ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, ఆధునిక విద్యా విధానాలు, అంతర్జాతీయ అనుభవాన్ని తెలంగాణకు అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్ర యువతకు మరిన్ని అవకాశాలు కల్పించవచ్చని పేర్కొన్నారు.
తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేసేందుకు ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భవిష్యత్ భాగస్వామ్యాలపై చర్చలు జరగడం ద్వారా రాష్ట్ర విద్యా వ్యవస్థకు అంతర్జాతీయ స్థాయి అనుసంధానం మరింత బలోపేతం కానుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















