కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి రానున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ధనుష్ తనకు మంచి స్నేహితుడని చెప్పిన ఆయన.. భవిష్యత్తులో ధనుష్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయనకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.
‘‘ధనుష్ నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎప్పటికీ వెంటే ఉంటాను. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా తప్పకుండా మద్దతు ఇస్తాను’’ అని జీవీ ప్రకాశ్ కుమార్ పేర్కొన్నారు. దీంతో ధనుష్ రాజకీయ ప్రవేశంపై మరోసారి చర్చ మొదలైంది.
ఇటీవల ధనుష్ తన అభిమానులను ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో ‘ఓం’ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన అభిమానులతో ముచ్చటించారు. షూటింగ్ విరామంలో అభిమానులతో మాట్లాడిన ధనుష్.. వారి సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం.
మరోవైపు ధనుష్ అభిమాన సంఘం కూడా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆల్ ఇండియా ధనుష్ ఫ్యాన్స్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో కొత్త సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆయా సంఘాల్లో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఫ్యాన్ క్లబ్ నాయకులు పిలుపునిచ్చారు.
అభిమాన సంఘాల కార్యకలాపాలు, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెరగడం.. ధనుష్ స్వయంగా అభిమానులతో సమావేశం కావడం వంటి పరిణామాలతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశాలపై ఊహాగానాలు మరింత పెరిగాయి. అయితే ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో జీవీ ప్రకాశ్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















