సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, కోస్ట్‌గార్డ్ సిబ్బంది సమన్వయంతో గాలింపు చేపట్టి అప్పన్నను క్షేమంగా కుటుంబసభ్యుల వద్దకు చేర్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈనెల 16న ఎనిమిది మంది మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. తీరానికి సుమారు 12 నాటికల్ మైళ్ల దూరంలో బోటు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మత్స్యకారుడు అప్పన్న గల్లంతైనట్లు అధికారులు హోంమంత్రికి వివరించారు. ప్రమాదం అనంతరం మిగిలిన మత్స్యకారుల పరిస్థితి, వారికి అందిన సహాయక చర్యలపై కూడా అనిత ఆరా తీశారు.
గల్లంతైన మత్స్యకారుడి కోసం సముద్రంలో విస్తృతంగా గాలింపు చేపట్టాలని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని హోంమంత్రి ఆదేశించారు. గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, పరిస్థితిని తనకు తెలియజేయాలని అధికారులకు సూచించారు.
మత్స్యకారుల కుటుంబసభ్యులకు ధైర్యం కల్పిస్తూ ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రత విషయంలో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















