అప్పటివరకు పెళ్లి వేడుకలో ఆనందంగా గడిపిన ఓ భారత సంతతి కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. వివాహం జరిగిన కొన్ని గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటన అమెరికాలోని జార్జియాలో చోటుచేసుకుంది.
డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్న 25 ఏళ్ల డేవ్ ఫిజీ (Dave Fiji) అట్లాంటాలో నివాసం ఉంటున్నారు. ఆయన తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం కేరళలోని ఎర్నాకుళం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. మే 29న జార్జియాలోని డాసన్‌విలే ప్రాంతంలో డేవ్ ఫిజీకి జెస్నితో వివాహం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
వివాహ అనంతరం రాత్రి సుమారు 10 గంటల సమయంలో వధూవరులు డాసన్‌విలే వేదిక నుంచి హెలికాప్టర్‌లో అట్లాంటాలోని ఓ హోటల్‌కు బయల్దేరారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పర్వత ప్రాంతంలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో డేవ్ ఫిజీతో పాటు పైలట్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
సహాయక బృందాలు చేరుకునే సమయానికి జెస్ని శిథిలాల కింద చిక్కుకుపోయారు. తీవ్ర గాయాలతో ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వాతావరణ పరిస్థితులు బాగోలేవని, ప్రయాణం వాయిదా వేయాలని డేవ్ ముందుగా సూచించినట్లు ఆయన తండ్రి జార్జ్ ఫిజీ తెలిపారు. అయితే తర్వాత ఎక్కువ ఎత్తులో ప్రయాణించాలని నిర్ణయించుకుని హెలికాప్టర్‌లో బయల్దేరినట్లు వివరించారు.
డేవ్ ఫిజీ మృతితో జెస్ని తీవ్ర షాక్‌లోకి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక 30 రోజుల్లో విడుదల కానుందని అధికారులు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















