కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది. టుంబ్లెర్ రిడ్జ్ సెకండరీ పాఠశాలలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడడంతో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 25 మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పుల అనంతరం అనుమానితుడు తనను తాను గాయపర్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే అతని వివరాలను ఇప్పటివరకు వెల్లడించలేదు.
ఇదిలా ఉండగా, స్కూల్ సమీపంలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు మృతదేహాలు లభ్యమైనట్లు సమాచారం. వీరు కూడా ఈ కాల్పుల ఘటనతో సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసి, ఇళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాల్పుల కారణాలు, నేపథ్యం, దుండగుడి ఉద్దేశం ఏమిటన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















