మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన పరిణామాల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బిల్లు ఓడిపోవడాన్ని సంబరంగా జరుపుకోవడం దురదృష్టకరమని, దేశ మహిళలు దీనిని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను వారు ఎప్పటికీ మరిచిపోరని హెచ్చరించారు.
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ అమిత్ షా మాట్లాడారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో గోల చేయడం ద్వారా బాధ్యత నుంచి తప్పించుకోవచ్చేమో కానీ, ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు మహిళల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఉత్తరాది-దక్షిణాది అనే విభజన రాజకీయాలను ప్రతిపక్షాలు ప్రోత్సహిస్తున్నాయని షా ఆరోపించారు. దేశం ఒక్కటేనని, ప్రాంతాల ఆధారంగా విభజన సరికాదని స్పష్టం చేశారు. కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా సమాన హక్కులు ఉంటాయని, పార్లమెంట్ సభ్యులందరికీ సమాన అధికారం ఉంటుందని తెలిపారు.
డీలిమిటేషన్‌పై వస్తున్న అభ్యంతరాలను కూడా ఆయన ఖండించారు. జనాభా పెరుగుదల ఆధారంగా సీట్ల పునర్విభజన అవసరమని, ఇది ప్రజలకు మరియు ప్రజాప్రతినిధులకు ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఉదాహరణగా మల్కాజ్‌గిరి, దిల్లీ, బెంగళూరు, గాజియాబాద్ వంటి ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు.అదేవిధంగా, లోక్‌సభ సీట్ల పెంపుపై కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ, 1972లో ఇందిరా గాంధీ ప్రభుత్వం సీట్లు పెంచిన తర్వాత ఇంతకాలం పెంపు జరగకుండా అడ్డుకున్నది వారేనని ఆరోపించారు. ప్రతిపక్షాలురిజర్వేషన్లకు మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రాతినిధ్యం పెరగడానికీ వ్యతిరేకంగా ఉన్నాయని షా వ్యాఖ్యానించారు.మొత్తంగా మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ అంశాలపై కేంద్రం-ప్రతిపక్షాల మధ్య విభేదాలు మరింత తీవ్రమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















