పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి పరిధిలో ఒంగోలుకు చెందిన యువ న్యాయవాది శ్రీరామ హరిప్రసాద్ (37) అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది.పోలీసుల వివరాల ప్రకారం, ఒంగోలు కర్నూలు రోడ్డులో నివాసముంటున్న హరిప్రసాద్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. గురువారం ఆయన హైకోర్టుకు వెళుతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. అదే రోజు రాత్రి 8.43 గంటలకు కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది.
అయితే శుక్రవారం తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మూడు గంటల మధ్యలో హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం జరిగినట్లు కూడా దర్యాప్తులో తేలుతోంది.స్థలంలో స్కూటీ రోడ్డుపక్కన పడిఉండగా, దాని కింద హరిప్రసాద్ నిర్జీవంగా కనిపించారు. ఆయన తలపై బలమైన గాయం ఉన్నట్లు గుర్తించారు. ఘటన స్థలానికి క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ బృందం, పోలీసు జాగిలాలను రప్పించి ఆధారాలు సేకరించారు.
ప్రాథమిక విచారణలో నరసరావుపేట ప్రాంతంలో రాత్రి సమయంలో ఆయన కనిపించినట్లు సమాచారం ఉంది. అలాగే ఆయన ప్రయాణిస్తున్న స్కూటీని మరో ద్విచక్రవాహనం అనుసరించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో లభించినట్లు తెలుస్తోంది.మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును హత్యగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















