మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ నిర్మాణంలో కాంక్రీటు నాణ్యతపై లోపాలు ఉన్నట్లు కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) నిర్వహించిన పరీక్షల్లో తేలింది. 16 నుంచి 21వ పియర్ వరకు నాణ్యత పూర్‌గా ఉండటం లేదా సందేహాస్పదంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 19వ పియర్‌లో 73.3 శాతం, 18వ పియర్‌లో 65.5 శాతం, 20వ పియర్‌లో 61.1 శాతం ఫలితాలు నాణ్యత లోపాలను లేదా సందేహాలను సూచిస్తున్నట్లు వెల్లడించింది.
యూపీవీ, రీబౌండ్ హ్యామర్ పరీక్షల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు సీడబ్ల్యూపీఆర్‌ఎస్ తెలిపింది. బీటలు, కాంక్రీటు క్షీణత లేదా అంతర్గతంగా ఖాళీ ప్రదేశాలు ఏర్పడటం వంటి కారణాలతో పియర్లు బలహీనపడి ఉండొచ్చని అధ్యయనం పేర్కొంది. ఈ పియర్లు ఏడో బ్లాక్‌లో కీలకమైనవిగా గుర్తించి, పునరుద్ధరణకు ముందు మరింత సమగ్ర పరిశీలన, అనుబంధ పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేసింది.
అయితే మేడిగడ్డలోని మిగిలిన బ్లాక్‌లలో పెద్దగా నాణ్యతా సమస్యలు కనిపించలేదని నివేదిక స్పష్టం చేసింది. ఒకటి నుంచి ఆరో బ్లాక్, ఎనిమిదో బ్లాక్‌లలో కాంక్రీటు నాణ్యత మొత్తంగా సంతృప్తికరంగా ఉన్నట్లు పేర్కొంది. ఆరో బ్లాక్‌లోని 33, 34వ పియర్లలో కొంత భాగంపై సందేహాలు వ్యక్తమైనా.. 95 శాతం ఫలితాలు అనుకూలంగా ఉండటంతో మొత్తం నాణ్యత సంతృప్తికరమేనని తేల్చింది.
అన్నారం బ్యారేజీలో అన్ని బ్లాక్‌లు, పియర్లలో కాంక్రీటు నాణ్యత బాగున్నట్లు పరీక్షలు వెల్లడించాయి. 72 పియర్లపై నిర్వహించిన పరీక్షల్లో సుమారు సగం ఫలితాలు ‘ఎక్స్‌లెంట్’, మిగిలినవి ‘గుడ్’గా నమోదయ్యాయి. సుందిళ్ల బ్యారేజీలోనూ కాంక్రీటు నాణ్యత స్థిరంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. నాలుగో బ్లాక్‌లోని కొన్ని పియర్లలో స్వల్ప తేడాలు గుర్తించినప్పటికీ.. మొత్తం బ్యారేజీ నాణ్యతపై ప్రభావం చూపే స్థాయిలో సమస్య లేదని స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















