అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్‌కు స్థానిక న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా 75 దేశాల పౌరుల ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది.
ఈ నిర్ణయం ఫెడరల్ వలస చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉందని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జీనెట్ పేర్కొన్నారు. వలస వీసాల విషయంలో కాన్సులర్ అధికారుల జోక్యానికి సంబంధించి విదేశాంగ కార్యదర్శికి ఉన్న అధికారాలను ఫెడరల్ చట్టం పరిమితం చేసిందని ఆమె స్పష్టం చేశారు.
75 దేశాల పౌరుల వీసా ప్రాసెసింగ్‌ను పూర్తిగా నిలిపివేసే అధికారం అమెరికా ప్రభుత్వానికి లేదని న్యాయస్థానం పేర్కొంది. దీంతో ట్రంప్ సర్కార్ తీసుకున్న వీసా నిర్ణయంపై కోర్టు జోక్యం చేసుకున్నట్లైంది.
75 దేశాల నుంచి వచ్చే కొంతమంది వలసదారులు అమెరికా సంక్షేమ పథకాలపై అధికంగా ఆధారపడుతున్నారని అప్పట్లో అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. కొత్త వలసదారులు అమెరికా ప్రజల సంపదపై భారం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.
అమెరికా ప్రయోజనాలకే తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొంటూ.. సంబంధిత దేశాల పౌరుల ఇమ్మిగ్రెంట్ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేసినట్లు అప్పట్లో ప్రకటించింది. తాజాగా కోర్టు తీర్పుతో ఆ నిర్ణయానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















