త్వరలో అమల్లోకి రానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి మరికొన్ని రైల్వే సెక్షన్లను విలీనం చేసి అందుకు అవసరమైన పాలనాపరమైన మార్పులు చేయాలని రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. రాష్ట్ర పరిధిలోకి వచ్చే అరకు-కొత్తవలస, కర్నూలు-డోన్ సెక్షన్‌లను కొత్త జోన్‌లో కలపాలన్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం కలుగుతుందన్నారు. విశాఖలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయాన్ని మంగళవారం రైల్వేశాఖ మంత్రితో కలిసి సీఎం సందర్శించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులతో వారు సమీక్షించారు. కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు సహా ఏపీలోని రైల్వే ప్రాజెక్టుల గురించి అధికారులు వారికి వివరించారు. రాష్ట్రంలో పురోగతిలో ఉన్న కీలక ప్రాజెక్టులు, ప్రతిపాదిత నూతన మార్గాలు వాటి పనుల గురించి మంత్రి స్వయంగా సీఎంకు వివరించారు. అలాగే ‘గతిశక్తి’ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ఓడరేవులను అనుసంధానించి, సరకు రవాణా, ఎగుమతులపై చర్చించారు. ఏపీ నుంచి వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసేందుకు, రాష్ట్రాన్ని సరకు రవాణాహబ్‌గా మార్చేందుకు ప్రత్యేక కంటెయినర్ రైళ్లు అవసరమని సీఎం తెలిపారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ కొత్త లైన్లు వేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న పోర్టులతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు అనుసంధానం పెంచాలన్నారు. కేంద్రమంత్రి మాట్లాడుతూ ఏపీలోని ఓడరేవులను అనుసంధానించేలా రైల్వే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమావేశంలో విప్ గణబాబు, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, గాదె శ్రీనువాసులునాయుడు, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, వెలగపూడి రామకృష్ణబాబు, రమేష్‌బాబు, వంశీకృష్ణశ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















