Meta ఇటీవల భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన నేపథ్యంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లేఆఫ్స్‌కు ముందు ఉద్యోగులతోనే ఏఐ టూల్స్ తయారుచేయించి, తర్వాత అదే టూల్స్ ద్వారా వారి స్థానాలను భర్తీ చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు చర్చనీయాంశమైంది.
జూలియన్ అనే వ్యక్తి ఎక్స్‌లో చేసిన పోస్టు ప్రకారం.. కొన్ని నెలల క్రితం మెటా సంస్థలో ‘AI Week’ నిర్వహించిందని, ఆ సమయంలో సాధారణ పనులను పక్కనపెట్టి అంతర్గత ఏఐ టూల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఉద్యోగులకు ఆదేశించిందని పేర్కొన్నారు. తన భార్య కూడా ఈ ప్రాజెక్టులో భాగమై సీనియర్ ఇంజినీర్లతో కలిసి నెలల పాటు పని చేసిందన్నారు. చివరకు అదే లేఆఫ్స్‌లో ఆమె ఉద్యోగం కోల్పోయిందని వెల్లడించారు.
ఈ ఆరోపణలపై మెటా నుంచి అధికారిక స్పందన రాకపోయినా, ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏఐ అభివృద్ధి భవిష్యత్తులో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పుగా మారవచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.ఇదిలా ఉండగా, Asha Rawal అనే మాజీ ఉద్యోగిని మాత్రం ఉద్యోగం కోల్పోయిన తర్వాత తాను చాలా స్వేచ్ఛగా, ఆనందంగా ఉన్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్టు చేయడం కూడా చర్చనీయాంశమైంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















