పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ మార్గంలో అంతరాయాల నేపథ్యంలో భారత్ తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో చౌకగా లభిస్తున్న వెనెజువెలా క్రూడ్ ఆయిల్‌ను భారీగా దిగుమతి చేసుకుంటోంది. దీంతో మే నెలలో భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా Venezuela నిలిచింది.
ఎనర్జీ కార్గో ట్రాకర్ కెప్లర్ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో ఇప్పటివరకు భారత్ రోజుకు సుమారు 4.17 లక్షల బ్యారెళ్ల వెనెజువెలా చమురును దిగుమతి చేసుకుంది. ఏప్రిల్‌లో ఇది 2.83 లక్షల బ్యారెళ్లుగా నమోదైంది. ప్రస్తుతం Russia, United Arab Emirates తర్వాత వెనెజువెలానే భారత్‌కు కీలక సరఫరాదారుగా మారింది.
ప్రత్యేకంగా Reliance Industries వెనెజువెలా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తోంది. గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ హెవీ సల్ఫర్ క్రూడ్‌ను సమర్థంగా శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉండటంతో ఈ దిగుమతుల ద్వారా రిలయన్స్‌కు లాభం చేకూరుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు భారత్ పలు దేశాల నుంచి దిగుమతులు విస్తరించడం ద్వారా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోందని నిపుణులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















