అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మెటా కోసం భారతదేశంలో నిర్మించనున్న తొలి ‘బిల్ట్ టూ సూట్’ డేటా కేంద్రం ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక భాగస్వామిగా మారింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపకల్పన చేసి నిర్మించే ఈ డేటా సెంటర్‌ను గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్నారు.
168 మెగావాట్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్న ఈ ఏఐ డేటా సెంటర్‌ను రెండేళ్లలో పూర్తి చేసి మెటాకు అందించేందుకు ఒప్పందం కుదిరింది. భవిష్యత్తులో ఈ కేంద్రం సామర్థ్యాన్ని మరింత విస్తరించే అవకాశమూ ఉంది. పూర్తి సామర్థ్యాన్ని మెటా దీర్ఘకాలికంగా లీజుకు తీసుకోనుంది.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా పునరుత్పాదక ఇంధనంపై పనిచేయనుంది. అలాగే శీతలీకరణ కోసం సముద్రపు ఉప్పు నీటిని శుద్ధి చేసి ఉపయోగించే సాంకేతికతను వినియోగించనున్నారు. ఇది పర్యావరణ అనుకూల డేటా సెంటర్‌గా నిలవనుంది.
ఈ ప్రాజెక్టులో డిజైన్, నిర్మాణం, నిరంతర విద్యుత్ సరఫరా, నెట్‌వర్క్ అనుసంధానత నుంచి ఆపరేషన్స్ వరకు అన్నింటినీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘సింగిల్ విండో సొల్యూషన్’ విధానంలో నిర్వహించనుంది.
ఈ ఒప్పందం భారత్ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. హైపర్‌స్కేల్ ఏఐ కంప్యూటింగ్‌కు జామ్‌నగర్ ఒక ముఖ్య కేంద్రంగా మారబోతోందని రిలయన్స్ సీఎండీ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
అదేవిధంగా మెటా, ఫోర్త్ పార్టనర్ ఎనర్జీతో 88 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల కోసం మరో భాగస్వామ్యాన్ని కూడా కుదుర్చుకుంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో సౌర మరియు పవన విద్యుత్ ప్రాజెక్టులు అభివృద్ధి చేయనున్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే శుద్ధ విద్యుత్‌ను మెటా పూర్తిగా వినియోగించనుంది. ఇది భారత పవర్ గ్రిడ్‌కు అదనపు గ్రీన్ ఎనర్జీ అందించడంలో సహాయపడనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















