నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పార్లమెంటు ఉభయసభలను కుదిపేస్తోంది. లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై పోలీసుల చర్యలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో నినాదాలతో ఆందోళన చేపట్టారు.
ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీకేజీపై లోక్‌సభలో సమగ్ర చర్చకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేస్తూ.. వీధుల్లో ఆందోళనలు చేయడం ద్వారా సమస్యలకు పరిష్కారం లభించదని అన్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత కె.సి. వేణుగోపాల్ స్పందిస్తూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
మరోవైపు కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు నల్లచొక్కాలు ధరించి పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టారు. విద్యార్థులకు సంఘీభావంగా నినాదాలు చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలపై చర్చకు కాంగ్రెస్ సభ్యులు రేణుకా చౌదరి తదితరులు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు.
చర్చకు ప్రతిపక్షం కొత్త షరతులు పెడుతోందని మంత్రి రిజిజు ఆరోపించగా.. నీట్ అంశంపై 267 నిబంధన కింద చర్చ చేపట్టాలని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తదితరులు డిమాండ్ చేశారు. ఇరుపక్షాల వాదోపవాదాల మధ్య సభ గురువారానికి వాయిదా పడింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















