పెట్రోల్, డీజిల్ సరఫరాపై వస్తున్న వదంతుల నేపథ్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ కీలక ప్రకటన చేశారు. ఇంధన లభ్యతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని, ప్రజలు ప్యానిక్ కాకుండా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పెట్రోల్, డీజిల్ స్టాక్ ఉన్నా బంక్‌లు మూసివేస్తే సంబంధిత నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రతి పెట్రోల్ బంక్‌ను తహసీల్దార్లు మరియు సంబంధిత అధికారులు నిరంతరం తనిఖీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఎలాంటి అక్రమాలు లేదా అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇంధన సరఫరా పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుగుతున్నాయని, ప్రజలు వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















