ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జలస్వప్నం సాకారం దిశగా కీలక అడుగు పడింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్ర ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పాయకరావుపేటలో గోదావరికి అఖండ హారతి ఇచ్చి నీటిని విడుదల చేయనున్నారు.
గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు చేర్చే ఈ ప్రయాణంలో పోలవరం ఎడమ కాలువ కీలక పాత్ర పోషించనుంది. కొండలు, లోయలు, వాగులు, వంకలు, రహదారులు, రైల్వే మార్గాలను దాటుకుంటూ కాలువను నిర్మించడం వెనుక భారీ ఇంజినీరింగ్ కృషి ఉంది. నిర్మాణంలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ అధికారులు, ఇంజినీర్లు, కార్మికులు చేసిన శ్రమకు ఈ కాలువ ప్రతిరూపంగా నిలుస్తోంది.
గోదావరి జలాలు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో సాగునీటి విస్తీర్ణం పెరగడంతో పాటు తాగునీటి అవసరాలకు కూడా ఊరట లభించే అవకాశం ఉంది. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దశాబ్దాలుగా నీటి కోసం ఎదురుచూస్తున్న ప్రాంతాలకు గోదావరి జలాలు చేరువవుతున్న వేళ.. పోలవరం ఎడమ కాలువ ఎలా ఉంది? ఎలాంటి ప్రాంతాల మీదుగా సాగుతోంది? నిర్మాణంలో కనిపించే ఇంజినీరింగ్ అద్భుతాలేమిటి? డ్రోన్ దృశ్యాల్లో పూర్తిగా చూసేయండి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















