తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్ చేయడం రాజకీయంగా, సినీ వర్గాల్లో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వస్తున్న విమర్శలకు నటి సంజన స్పందించారు. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని, ఆయన పాలనపై మాట్లాడాలని సూచించారు.
విజయ్ రాజకీయంగా విజయవంతమైన ప్రయాణాన్ని కొందరు ఓర్వలేకే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని సంజన అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యలపై ఆయన వేగంగా స్పందిస్తున్నారని, పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవ ఇతర రాష్ట్రాల ప్రజలను సైతం ఆకర్షిస్తోందని పేర్కొన్నారు.
‘‘విజయ్ సమర్థంగా పరిపాలిస్తున్నందున ఆయనపై వృత్తిపరమైన ఆరోపణలు చేయలేకపోతున్నారు. పాలనలో లోపాలు కనిపించనప్పుడు వ్యక్తిగత అంశాలను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని కించపరచడం సరికాదు. ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి రాజకీయాలు ఎప్పటికీ ఆమోదయోగ్యం కావు’’ అని సంజన పేర్కొన్నారు.
నటి త్రిష గురించి కూడా సంజన స్పందించారు. త్రిష చాలా గొప్ప నటి అని, సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. విజయ్, త్రిష మధ్య ఉన్న బంధం పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చూసి వారి బంధంపై ఒక నిర్ణయానికి రావడం సరికాదని సంజన అన్నారు. వ్యక్తిగత సంబంధాలపై ఊహాగానాలు చేయడం, వాటిని రాజకీయ విమర్శలకు ఉపయోగించడం తగదని పేర్కొన్నారు.
విజయ్ పాలన, ప్రజా విధానాలు, సంక్షేమ కార్యక్రమాలపై విమర్శలు ఉంటే వాటి గురించి మాట్లాడాలని.. వ్యక్తిగత జీవితాన్ని వివాదాల్లోకి లాగడం మాత్రం సరైన పద్ధతి కాదని సంజన అభిప్రాయపడ్డారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















