ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రఘువంశీ ఔట్ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్‌లో ఐదో ఓవర్లో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో జరిగిన ఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
బ్యాటర్ రఘువంశీ మిడాన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం పరుగెత్తగా, మరో బ్యాటర్ గ్రీన్ స్పందించకపోవడంతో అతడు వెనక్కి తిరిగాడు. ఆ సమయంలో ఫీల్డర్ చేసిన త్రో అతని కాళ్లకు తగలడంతో పరిస్థితి మారింది. అప్పటికే రఘువంశీ పిచ్ మధ్యలో దిశ మార్చుకున్నాడని, ఫీల్డర్‌కు అడ్డుగా నిలిచాడని భావించి మూడో అంపైర్ ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కింద ఔట్‌గా ప్రకటించారు. ఈ నిర్ణయంపై కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆటగాడు రఘువంశీ కూడా మైదానంలో అంపైర్లతో వాదనకు దిగాడు. ఆగ్రహంతో అతను హెల్మెట్, బ్యాట్‌ను విసిరేసిన ఘటన కూడా చోటుచేసుకుంది.
ఈ ఔట్‌తో కేకేఆర్ శిబిరం షాక్‌కు గురైంది. ఇక ఈ రకమైన ఔట్ ఐపీఎల్ చరిత్రలో అరుదుగా చోటు చేసుకుంటుంది. గతంలో యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా కూడా ఇలాంటి ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ ఔట్‌గా వెనుదిరిగిన వారిలో ఉన్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అంపైర్ నిర్ణయం సరైనదా కాదా అనే విషయంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















