అనారోగ్యానికి గురైనప్పుడు ఇంటర్నెట్, చాట్‌జీపీటీ వంటి వేదికల్లో లక్షణాలను వెతికి.. తమకు ఫలానా వ్యాధి ఉందని స్వయంగా నిర్ధారించుకోవద్దని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సూచించారు. ఇలా ఆన్‌లైన్‌లో లక్షణాలను చూసుకుని రోగ నిర్ధారణ చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని ఆయన అన్నారు.
శనివారం నోయిడాలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ.. ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం మంచి పరిణామమే అయినప్పటికీ, ఇంటర్నెట్‌లో కనిపించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని వ్యాధి నిర్ధారణకు రావడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
స్వల్పంగా ఛాతినొప్పి వచ్చినా కొందరు ఆన్‌లైన్‌లో వెతికి తమకు తీవ్రమైన గుండె జబ్బు ఉందని భయపడుతున్నారని చెప్పారు. అయితే అదే నొప్పి ఆందోళన లేదా కండరాలకు సంబంధించిన సమస్యల వల్ల కూడా రావచ్చని వివరించారు. కొందరు రోగులు తమకు ఉన్న లక్షణాలను వైద్యుడికి వివరించకుండా.. ఇంటర్నెట్‌లో చదివిన వ్యాధి పేరునే వైద్యుడికి చెబుతున్నారని అన్నారు.
గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోగులు స్థానిక భాష, మాండలికాల్లో లక్షణాలను వివరించడం కూడా వైద్యులకు సవాలుగా మారుతోందని రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఓ గ్రామీణ వ్యక్తి ఛాతీలో ‘దుక్ దుక్’గా ఉందని వైద్యుడికి చెప్పిన ఉదాహరణను ఆయన ప్రస్తావించారు. వైద్య విద్యలో ‘దుక్ దుక్’ అనే లక్షణం ఉండదంటూ ఆయన చమత్కరించారు.
యంత్రాల ద్వారా శరీరంలో ఏం జరుగుతుందో గుర్తించగలిగినప్పటికీ.. రోగి మనసులోని భయం, ఆందోళనను అర్థం చేసుకోవడం వైద్యులకే సాధ్యమని రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. అందువల్ల ఆన్‌లైన్ సమాచారాన్ని వైద్య సలహాకు ప్రత్యామ్నాయంగా భావించవద్దని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















