యానాంలో వివాహిత దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్యను భర్తే హత్య చేసి గోదావరి నదిలో పడేసినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం భార్య కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.
చెక్క అప్పారావు, రేఖ (26) ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి బాబు, పాప ఉన్నారు. పెళ్లైన కొంతకాలానికి దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇరువర్గాల పెద్దలు పలుమార్లు ఇద్దరికీ సర్దిచెప్పి రాజీ కుదిర్చారు.
ఈ క్రమంలో మరోసారి దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన అప్పారావు తన భార్య రేఖను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యానాం గణపతినగర్ సమీపంలోని గోదావరి నదిలో ఆమె మృతదేహాన్ని పడేసినట్లు వెల్లడైంది.
ఆ తర్వాత ఉదయం నుంచి రేఖ కనిపించడం లేదంటూ అప్పారావు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ప్రశ్నల్లో అప్పారావు భార్యను తానే హత్య చేసినట్లు అంగీకరించినట్లు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోదావరి నదిలో రేఖ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















