భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తన రచించిన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఇటీవల జరుగుతున్న చర్చలపై స్పందించారు. పుస్తకం ఇంకా ప్రచురితం కాకముందే దీనిని వివాదంలోకి లాగడం అనవసరమని ఆయన పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నరవణె, తనను ఈ వివాదంలోకి తీసుకురావడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పుస్తకానికి రక్షణ మంత్రిత్వశాఖ అనుమతి ప్రక్రియలో ఉండటంతో ప్రచురణ నిలిపివేయబడిందని, ఆ అంశం అప్పటికే ముగిసిన విషయమని తెలిపారు.
అయితే ప్రచురితం కాని పుస్తకంపై చర్చలు జరపడం ద్వారా తనను అనవసరంగా వివాదంలోకి లాగారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల ద్వారా ఆయన పరోక్షంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై విమర్శలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక ఆయన రాసిన మరో పుస్తకం ‘ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్: అన్‌ఎర్త్ మిలిటరీ మైత్స్ అండ్ మిస్టరీస్’ ఇటీవల విడుదలై మంచి స్పందన పొందింది. చైనా సైన్యంతో జరిగిన ఘటనలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించిన కారణంగా ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంపై అప్పట్లో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆ పుస్తకాన్ని లోక్‌సభలో ప్రస్తావించడం కూడా అప్పట్లో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















