దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్‌లో పన్నుల అంశాలపై నిన్న మదుపర్లు నిరాశకు గురై భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, బడ్జెట్‌లోని ఇతర సానుకూల అంశాలపై దృష్టి సారించడంతో నేడు మార్కెట్ బలంగా పుంజుకుంది.
ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం వరకు మోస్తరు లాభాల్లో కదలాడగా, ఆఖర్లో భారీ కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ షేర్లు సూచీలకు ప్రధానంగా దన్నుగా నిలిచాయి.
ఈ లాభాల ప్రభావంతో మదుపర్ల సంపద ఒక్కరోజులోనే దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర పెరిగి రూ.455 లక్షల కోట్లకు చేరింది. నిఫ్టీ మళ్లీ 25 వేల మార్కును అందుకోవడం గమనార్హం.
సెన్సెక్స్ ఉదయం 80,555.68 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, ఇంట్రాడేలో 81,732.25 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. చివరికి 943.52 పాయింట్ల లాభంతో 81,666.46 వద్ద ముగిసింది. నిఫ్టీ 252.95 పాయింట్లు పెరిగి 25,088.40 వద్ద స్థిరపడింది.
డాలరుతో రూపాయి మారకం విలువ 91.50గా కొనసాగింది. సెన్సెక్స్ 30 షేర్లలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభపడగా, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ట్రెంట్, టైటాన్ షేర్లు నష్టాలు చవిచూశాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 66 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు ధర 4,680 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















