వేసవి 2026కు టాలీవుడ్ మళ్లీ పుంజుకుంది. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రిలీజ్‌లు, స్టార్ హీరోల పోటీతో ఈసారి సమ్మర్ సీజన్ థియేటర్ల వద్ద హంగామా ఖాయం అన్న అంచనాలు కనిపిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో వరుసగా స్టార్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
మార్చి రిలీజ్‌ల హడావుడి
మార్చి 6న ‘సతీ లీలావతి’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున ‘సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ కూడా విడుదలకు సిద్ధమైంది. కుటుంబ కథా చిత్రాలుగా ఇవి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
మార్చి 13న యువ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి నటించిన ‘బ్యాండ్ మేళం’ విడుదల కానుంది. సంగీత నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం యూత్‌ను టార్గెట్ చేస్తోంది.
ఉగాది సందర్భంగా మార్చి 19న భారీ అంచనాలతో ‘టాక్సిక్’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అదే రోజున ‘ధురంధర్ ‘2 కూడా విడుదల కానుంది. బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ధురంధర్’ కి సీక్వెల్‌గా వస్తోంది.
మార్చి 26న పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదలకు సిద్ధమైంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే భారీ బడ్జెట్ను సొంతం చేసుకుంది. రాశీ ఖన్నా, శ్రీలీల కథానాయికలు.
ఏప్రిల్‌లో వరుస స్టార్ సినిమాలు
ఏప్రిల్ 3న శర్వానంద్ బైక్ రేసర్‌గా కనిపించనున్న” బైకర్” విడుదల కానుంది. అదే రోజున సంగీత్ శోభన్ నటించిన ‘రాకాస’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏప్రిల్ 10న నిఖిల్ సిద్ధార్థ నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ విడుదల అవుతోంది. ఇదే రోజున అడివి శేష్ నటించిన ‘డెకాయిట్’ కూడా థియేటర్లలోకి రానుంది.
ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ గ్రాండ్‌గా విడుదల కానుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.
ఇంకా విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలు
వేసవిలోనే చిరంజీవినటించిన “విశ్వంభర“, వెంకటేశ్ దగ్గుబాటి కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’, ‘గూఢచారి 2, అఖిల్ నటిస్తున్న ‘లెనిన్’ వరుణ్ తేజ్ యొక్క ‘కొరియన్ కనకరాజు’ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అధికారిక తేదీలపై త్వరలో స్పష్టత రానుంది.
ఈసారి సమ్మర్ ఎందుకు స్పెషల్?
వరుసగా స్టార్ హీరోల సినిమాలు
పాన్ ఇండియా రిలీజ్‌లు
యాక్షన్, స్పోర్ట్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల మేళవింపు
ఫెస్టివల్ రిలీజ్‌లతో భారీ కలెక్షన్ అంచనాలు
ఈసారి వేసవి సీజన్ నిజంగానే టాలీవుడ్‌కు బంగారు కాలంగా మారుతుందా? అన్నది చూడాలి. అయితే అభిమానులకు మాత్రం ఇది ఫుల్ మీల్స్ సమ్మర్ అని చెప్పొచ్చు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















