దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత ఘటనల నుంచి కూడా ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)పై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
ఈ కేసులో National Testing Agencyతో పాటు కేంద్ర ప్రభుత్వం, సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో 2024లో కూడా నీట్ పేపర్ లీక్ జరిగిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. అప్పట్లో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి కొన్ని సూచనలు చేసినప్పటికీ వాటి అమలుపై స్పష్టత లేకపోవడంపై కోర్టు ప్రశ్నించింది.
2026 మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షలో ప్రశ్నపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ, ఎన్‌టీఏ గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమని వ్యాఖ్యానించింది. మానిటరింగ్ కమిటీ సూచనలు అమలు చేశారా లేదా అనే విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.ఈ వ్యవహారంపై గురువారం లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్‌టీఏను సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, భద్రత పెంపుపై కేంద్రం తీసుకుంటున్న చర్యలపై కూడా వివరణ ఇవ్వాలని సూచించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















