స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. గత శాసనసభ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా 21 స్థానాల్లో పోటీ చేసిన వ్యూహం ఇకపై స్థానిక ఎన్నికలకు వర్తించదని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రతి ప్రాంతంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులను అంచనా వేసి స్థానికంగా పార్టీ బలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించాలని ఎమ్మెల్యేలకు సూచించారు.
మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికల్లో పోటీకి సంబంధించి పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పవన్ తెలిపారు. ఇందులో 9 నుంచి 11 మంది ఎమ్మెల్యేలతో పాటు సీనియర్ నాయకులకు చోటు కల్పించనున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించి, వాటి ఆధారంగా ఎన్నికల కార్యాచరణ రూపొందించనున్నారు.
గతంలో స్థానిక ఎన్నికల్లో ఎదురైన ఇబ్బందులను ప్రస్తావించిన పవన్.. ఒత్తిళ్లు, దాడులను ఎదుర్కొంటూ పార్టీ కోసం నిలబడిన జనసైనికులు, వీర మహిళల స్ఫూర్తిని గుర్తుంచుకుని ఈసారి ఎన్నికల్లో బలంగా ముందుకు సాగాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఎంత బలంగా నిలబడితే అంత మెరుగైన రాజకీయ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
అదే సమయంలో కొన్ని నియోజకవర్గాల్లో కూటమి ధర్మానికి భిన్నంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేల అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని ఎమ్మెల్యేలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాలు తన దృష్టికి కూడా వచ్చాయని, పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వారికి రాజకీయంగా మరింత బలం చేకూరేలా చర్యలు తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















