ఒక సినిమా థియేటర్లలో సందడి చేస్తుండగానే, దర్శకుడు–నటుడు తరుణ్ భాస్కర్ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇటీవల సోషల్ మీడియాలో ‘జీపీఎస్’ అనే సంక్షిప్త పేరుతో ఆసక్తిని రేకెత్తించిన తరుణ్ భాస్కర్, తాజాగా ఆ టైటిల్‌ను అధికారికంగా వెల్లడించారు.
తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పేరు ‘జీపీఎస్’. దీనికి పూర్తి పేరు ‘గాయపడ్డ సింహం’ (Gaaya Padda Simham). ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో
“గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది”
అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.అయితే, పోస్టర్‌పై ఉన్న “Don’t Laugh.. It’s a Serious Matter” అనే క్యాప్షన్‌ను బట్టి చూస్తే, ఈ చిత్రం కామెడీ నేపథ్యంతో, ప్రత్యేకమైన కథనంతో రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. టైటిల్ గంభీరంగా ఉన్నప్పటికీ, వినూత్న హ్యూమర్‌తో కథ సాగనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘జీపీఎస్’ టీజర్‌ను ఈ నెల 9న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటికే టైటిల్, పోస్టర్‌తో సోషల్ మీడియాలో చర్చ మొదలవ్వడంతో టీజర్‌పై అంచనాలు పెరిగాయి.
దర్శకుడిగా పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్, నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మహానటి, సీతారామం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.ఇటీవల హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు ‘జీపీఎస్’తో మరోసారి భిన్నమైన పాత్రలో, ప్రత్యేక కథతో ప్రేక్షకులను అలరించేందుకు తరుణ్ భాస్కర్ సిద్ధమవుతున్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















