కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి కోసం ఎలాంటి విప్లవం చేయాల్సిన అవసరం లేదని, కాలమే అన్ని విషయాలను నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. పార్టీ కోసం తాను చేస్తున్న కృషి అందరికీ తెలుసని, తనకు ఏ సమయంలో ఏ బాధ్యత ఇవ్వాలనే విషయం పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
కర్ణాటక సీఎం మార్పుపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం చర్చలు జరిపిందన్న వార్తలపై తనకు ఎటువంటి సమాచారం లేదని శివకుమార్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ అంశంపై చర్చించారనే వార్తలను తాను ధృవీకరించలేనని చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి తానెప్పుడూ బహిరంగంగా వ్యాఖ్యలు చేయలేదని వెల్లడించారు.
సీఎం పదవి ఖాళీ అయినప్పుడు మాత్రమే మరో వ్యక్తికి అవకాశం వస్తుందని, కానీ అలా కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని డీకే శివకుమార్ అన్నారు. ప్రజల కోసం తాను ఎన్నో ఉద్యమాలు చేశానని, కానీ పదవి కోసం ఎప్పుడూ పోరాటం చేయలేదని తెలిపారు.ఇదిలా ఉండగా, సీఎం సిద్ధరామయ్య మరియు డీకే శివకుమార్ మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తలను సిద్ధరామయ్య ఖండించారు. తమ మధ్య ఉన్న సంబంధం “పాలు–తేనె లాంటి బంధం” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, డీకే శివకుమార్‌కు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల ఫోన్లను తాను ట్యాపింగ్ చేయించానని బీజేపీ నేత ఆర్.అశోక్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని దెబ్బతీయడానికి ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సిద్ధరామయ్య అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐక్యంగా పనిచేస్తోందని, నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలకు ఎలాంటి ప్రాధాన్యం లేదని ఆయన స్పష్టం చేశారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















