హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు నాలుగు రోజుల పాటు మూసివేయనున్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీగా క్యూ కట్టిన దృశ్యాలు కనిపించడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెట్రోల్ బంకులు మూసివేయనున్నట్లు ప్రభుత్వం గానీ, పెట్రోల్ బంక్ యజమానుల సంఘం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గతంలో ట్రక్ డ్రైవర్ల సమ్మె సమయంలో తీసిన పాత వీడియోలను కొందరు మళ్లీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నట్లు సమాచారం.
ఇక మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్రోల్ సరఫరాలు తగ్గిపోతాయనే నిర్ధారణలేని సందేశాలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. ఈ వార్తలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించాయి. దీంతో సోమవారం (March 2) రాత్రి తరావీహ్ నమాజ్ అనంతరం పెద్ద సంఖ్యలో ప్రజలు తమ వాహనాలకు ఇంధనం నింపించుకునేందుకు సమీపంలోని పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లారు. అధికారులు మాత్రం ఇలాంటి వదంతులను నమ్మకుండా, అధికారిక సమాచారం వచ్చినప్పుడే స్పందించాలని ప్రజలకు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















