వేసవిలో డీహైడ్రేషన్ సాధారణ సమస్య. అంతేకాకుండా, చాలా మందికి వికారం, వాంతులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాంతులు తరచుగా అయితే శరీరం నుంచి నీటితో పాటు సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు కూడా తగ్గిపోతాయి. దీని వల్ల నీరసం, తల తిరగడం, నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్, కలుషిత నీరు లేదా వడదెబ్బ వల్ల కూడా వాంతులు పెరగవచ్చు. అయితే, ఇలాంటి సమయంలో ఏమి చేయాలి, ఏమి చేయకూడదో మీకు తెలుసా?
వికారంగా అనిపిస్తే ఏమి చేయాలి?
నిపుణుల ప్రకారం, ముందుగా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా అవసరం. ఒకేసారి ఎక్కువ నీరు తాగడం కంటే, కొద్దికొద్దిగా నీరు తాగడం మంచిది. కొబ్బరి నీరు లేదా ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన లవణాలు తిరిగి అందుతాయి. గంజి, అరటిపండు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.
ఏం చేయకూడదు?
- ఒకేసారి ఎక్కువగా నీరు తాగకూడదు.
- మసాలా, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
- ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు.
విశ్రాంతి కూడా అవసరం
శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. ఎండకు దూరంగా చల్లని ప్రదేశంలో ఉండాలి. వాంతులు ఆగకపోతే, ఎక్కువ నీరసం, తల తిరగడం లేదా జ్వరం ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వేసవిలో వచ్చే వాంతులు, వికారం సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















