ఉసిరి రసం ఆరోగ్యానికి నిజంగా ఒక వరంగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. ప్రతిరోజు సుమారు 50 ఎంఎల్ ఉసిరి రసం తీసుకోవడం ద్వారా అనేక దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించవచ్చు. ఆజీర్ణం, గుండె సంబంధిత సమస్యలు, షుగర్ లెవల్స్‌తో పాటు కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే జుట్టు సహజంగా నల్లగా మారడంలో కూడా ఉసిరి ఉపయోగకరంగా ఉంటుంది.
ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. పోషకాల శోషణ సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి శరీరానికి అవసరమైన పోషకాలు సరిగ్గా అందుతాయి. ఇందులో ఉన్న విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే జీర్ణ రసాల ఉత్పత్తి పెరగడం వల్ల మలబద్ధకం, అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. చర్మం ఎలాస్టిసిటీ పెరిగి ముడతలు తగ్గుతాయి. జుట్టు వేర్ల నుంచి బలపడి సహజంగా నల్లగా మారడానికి కూడా ఇది తోడ్పడుతుంది.
అదేవిధంగా ఉసిరి రసం కిడ్నీల ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కిడ్నీ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. కాలేయాన్ని డీటాక్సిఫై చేసి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. కాలేయ వాపు సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఉదయాన్నే ఉసిరి రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో సహాయం లభిస్తుంది. కొంచెం మిరియాల పొడి కలిపి తీసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించి డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. జీవక్రియ రేటు పెరగడం వల్ల శరీర శక్తి స్థాయిలు మెరుగుపడతాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















