సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అక్కడి భారత హై కమిషనర్ Shilpak Ambule తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధిలో సింగపూర్ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు.
ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీ, రోబోటిక్స్, మెడికల్ డివైసెస్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని సీఎం వివరించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగుతోందని, ప్రపంచ స్థాయి నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి రైతులు చేరుకున్నారని తెలిపారు.
సింగపూర్ టెక్ రంగ అవసరాలను తీర్చే నైపుణ్యం కలిగిన యువశక్తి ఏపీలో ఉందని పేర్కొన్న సీఎం, సింగపూర్ విశ్వవిద్యాలయాలు మరియు ఏపీ విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో “వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్” విధానాన్ని అమలు చేస్తున్నామని, భూ సమీకరణ ద్వారా పారిశ్రామిక ప్రాజెక్టులకు వేగంగా భూములు కేటాయిస్తున్నామని వెల్లడించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















