అమరావతి సచివాలయంలో సీఎం, మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్న సమావేశంలో బిల్ గేట్స్ పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. సమావేశం ప్రారంభంలోనే సీఎం చంద్రబాబును “నా గుడ్ ఓల్డ్ ఫ్రెండ్” అని సరదాగా వ్యాఖ్యానిస్తూ సాన్నిహిత్యాన్ని గుర్తుచేశారు.భారతదేశంలో ఇన్నోవేషన్స్, వేగవంతమైన నిర్ణయాలు, అమలు విధానం అద్భుతంగా ఉన్నాయని గేట్స్ ప్రశంసించారు. డిజిటల్ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు పడినట్టు పేర్కొన్నారు. ఈ విప్లవంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు.
తాను మొదటిసారి చంద్రబాబును కలిసిన సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రపంచ నాయకులలో చాలామందికంటే ఆయన ఆలోచనలు ముందున్నాయని అప్పుడే గ్రహించానని గేట్స్ వెల్లడించారు. సింగపూర్ మాజీ ప్రధాని తరహా దూరదృష్టి, విజన్ చంద్రబాబులో ఉందని పేర్కొన్నారు.
ఆరోగ్యం, విద్య, వ్యవసాయం – ప్రాధాన్యత గల రంగాలు
గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాల్లో మెజార్టీ ఆరోగ్య రంగానికి చెందినవేనని వివరించిన ఆయన, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కుప్పంలో అమలు చేస్తున్న ‘సంజీవని’ కార్యక్రమాన్ని మరోసారి ప్రశంసించారు.
విద్యారంగంలో ఏఐ (కృత్రిమ మేధ) వినియోగం ద్వారా విద్యార్థుల అవసరాలను అర్థం చేసుకుని, వారికి సరైన స్థాయిలో బోధన అందించవచ్చని చెప్పారు. విద్యలో అద్భుత మార్పులకు టెక్నాలజీ దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.వ్యవసాయం అత్యంత కీలక రంగమని, అయితే దాని ప్రాధాన్యతను ఇంకా చాలామంది సరిగా గుర్తించలేదని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ సాయంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐ వినియోగం అంతగా లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ ముందడుగు వేయడం అభినందనీయం అన్నారు.
డిజిటల్ గవర్నెన్స్ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌లో ముందస్తు అంచనాల కోసం టెక్నాలజీ వినియోగించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించే వ్యవస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని చెప్పారు. “డిజిటల్ గవర్నెన్స్” అనే భావనను ప్రపంచానికి వివరించేందుకు తాను ప్రయత్నిస్తున్న సమయంలోనే సీఎం చంద్రబాబు దాన్ని అమలు చేయడం విశేషమని గేట్స్ పేర్కొన్నారు.డ్రోన్ల వినియోగం ద్వారా వివిధ సేవలను అందించాలన్న ఆలోచనను కూడా ఆయన ప్రశంసించారు. మలేరియా, అనీమియా వంటి వ్యాధుల నివారణలో ప్రభుత్వాలు, సంస్థలు కలిసి పనిచేయాలని సూచించారు.
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సెంటర్ – ఆసక్తికర విశ్లేషణ
సమావేశంలో మంత్రులు పయ్యావుల, సత్యకుమార్ యాదవ్ గేట్స్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ కేంద్రం ఏర్పాటు వెనుక కారణం ఏమిటని అడిగిన ప్రశ్నకు గేట్స్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. నాటి సీఎం చంద్రబాబు ఐటీ రంగాన్ని ప్రోత్సహించడంతో హైదరాబాద్ టెక్ హబ్‌గా ఎదిగిందని, మైక్రోసాఫ్ట్ కార్యాలయం అక్కడ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా చంద్రబాబుదేనని గుర్తుచేశారు.తమ సిబ్బందిని అభిప్రాయం అడిగితే హైదరాబాద్‌కు వెళ్లడానికి సిద్ధమని చెప్పారని, నేటికీ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో హైదరాబాద్ వాసులే ఎక్కువగా ఉన్నారని గేట్స్ వెల్లడించారు.

Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews


















