పాత సినిమాలో “పెట్రోల్ ధర మండుతోంది… ఎడ్లు కట్టండి!” అన్న పాట ఒకప్పుడు పెట్రోల్ ధరల పెరుగుదలపై వ్యంగ్యంగా వినిపించింది. కానీ నేటి సూపర్ ఫాస్ట్ కాలంలో ఎద్దుల బండ్లు కనిపించడమే అరుదైపోయింది. వ్యవసాయ పనుల్లో కూడా వాటి వినియోగం తగ్గిపోయి, కొద్దిమంది చిన్న రైతుల దగ్గరే ఎక్కడక్కడో కనిపిస్తున్నాయి.
అయితే అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామంలో మాత్రం ఎద్దుల బండి ఒక అంబులెన్స్‌గా మారింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఆసుపత్రికి తరలించేందుకు భర్త 108 అంబులెన్స్‌కు కాల్ చేసినా, అది అందుబాటులో లేకపోయింది. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో మరో మార్గం లేక ఎద్దుల బండిపై ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవల పరిస్థితిని మళ్లీ ప్రశ్నార్థకంగా నిలబెట్టింది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















