గుడ్ గర్ల్ సిండ్రోమ్ (Good Girl Syndrome) మహిళల్లో పెరుగుతున్న సమస్య. ఇది అధికారిక వైద్య నిర్ధారణ కాదు, కానీ సమాజం, కుటుంబం విధించిన అంచనాల కారణంగా మహిళలు తమ వ్యక్తిగత అవసరాలను అణచివేయడం, ఇతరుల అభిమానం పొందడం కోసం ప్రవర్తించడం ఈ సమస్యకు మూలం. ఫలితంగా పీపుల్ ప్లీజింగ్, గొడవల భయం, స్వీయ హద్దులను నిర్ధారించలేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
నిరంతర ఒత్తిడితో హార్మోన్ల అసమతుల్యతలు, కార్టిసాల్ స్థాయిల పెరుగుదల, ప్రొజెస్టిరోన్ తగ్గుదల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం, PCOS లక్షణాలు తీవ్రమవడం, మెన్స్ట్రువల్ సమస్యలు, పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం, నిద్రలేమి, నిరంతర అలసట, మూడ్ స్వింగ్స్ వంటి అనారోగ్య లక్షణాలు ఏర్పడతాయి.
ప్రభావిత మహిళలు తరచుగా ఎల్లప్పుడూ పరిపూర్ణంగా ఉండాలనుకుంటూ, తమ భావోద్వేగాలను అణచివేస్తూ, ఒత్తిడిలో జీవిస్తారు. దీని వలన శరీరం ఎల్లప్పుడూ స్ట్రెస్ మోడ్‌లో ఉంటుంది, న్యూరోసైన్స్ అధ్యయనాలు కూడా దీన్ని నిర్ధారిస్తున్నాయి.
సమస్యను ఎదుర్కోవడానికి నిపుణులు సూచనలు ఇవీ:
- థైరాయిడ్, ఇన్సులిన్, LH, FSH, ప్రోలాక్టిన్ వంటి హార్మోన్లను క్రమం తప్పకుండా పరిశీలించుకోవడం.
- PCOS, థైరాయిడ్ సమస్యల ఉంటే వెంటనే చికిత్స ప్రారంభించడం.
- రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచే ఆహారం, జీవనశైలి మార్పులు.
- సరైన నిద్ర, యోగా, వ్యాయామం, ఫిట్‌నెస్, ఫైట్ ఆర్ ఫ్లైట్ ప్రతిస్పందనను తగ్గించడం.
- భావోద్వేగాలను అణచివేయకుండా జర్నలింగ్ లేదా థెరపీ ద్వారా విడుదల చేయడం.
పరిపూర్ణత కోసం పరుగులు తీయడం కన్నా శారీరక-మానసిక సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. ఇతరుల ఆమోదం కంటే స్వీయ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మహిళలు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించవచ్చు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews ViralNews WorldNews



















