గోదావరి జలాల వినియోగం మరియు వాటికి సంబంధించిన వివాదాలపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్ర చర్చ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాలకు పూర్తి స్థాయి అవకాశమిస్తామని, సభకు హాజరై చర్చలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ మళ్లించుకుంటున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఇలాంటి చౌకబారు విమర్శలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని అన్నారు. “తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఏపీకి మద్దతు ఇస్తారా?” అని ప్రశ్నించారు.
సమైక్య పాలనలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని, రాష్ట్రం ఏర్పాటయ్యాక నిధులు, నీటి వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ విధానపరమైన లోపాల వల్ల అనేక ప్రాజెక్టులు పూర్తి కాలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపైనే రూ.1.02 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు గుర్తుచేశారు.మహారాష్ట్ర సరిహద్దులోని తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష చేపడతామని తెలిపారు. అవి పూర్తయ్యేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి భేషజాలు లేకుండా చర్చలకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. చర్చల ద్వారానే జలవివాదాలు పరిష్కారమవుతాయని విశ్వసిస్తున్నామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వెనుకాడమని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడతామని, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో దేవాదుల ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ను ఆదివారం పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి జలాలను ఏపీ మళ్లించుకుంటున్నా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోందన్న విమర్శలు తగవని అన్నారు. “తెలంగాణలో గెలిచిన ఏ ప్రజాప్రతినిధి అయినా ఏపీకి మద్దతు ఇస్తారా?” అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పార్టీ ఆస్తి కాదని, ప్రజల సొమ్ముతో నిర్మించిన మూడు బ్యారేజీలను నిర్లక్ష్యం చేయబోమన్నారు. ప్రస్తుతం నిపుణులతో పరిశీలన చేయిస్తున్నామని, అవసరమైన మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకువస్తామని తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి నుంచి భద్రాచలం వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులపై సమగ్ర సమీక్ష చేపట్టి, అవి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని.
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో గోదావరి జలాల వినియోగం, వివాదాలపై ఒకరోజు సమగ్ర చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తామని, సభకు రావాలని పిలుపునిచ్చారు.దేవాదుల ప్రాజెక్టు 2001లో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. భూసేకరణకు కూడా నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంపై రూ.8.11 లక్షల కోట్ల అప్పు భారం ఉందని, అనేక ప్రాజెక్టుల్లో 70-80 శాతం పనులు పూర్తయినా నిధుల కొరతతో నిలిచిపోయాయని తెలిపారు.
రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో మంత్రులతో కలిసి సమీక్ష నిర్వహించామని చెప్పారు. భూసేకరణ, నిర్మాణం, నిర్వహణకు అవసరమైన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని వెల్లడించారు. 2001లో రూ.6 వేల కోట్ల అంచనాతో ప్రారంభమైన దేవాదుల ప్రాజెక్టు ఖర్చు ప్రస్తుతం రూ.18,500 కోట్లకు పెరిగిందని అధికారులు తెలిపారని, సవరించిన అంచనాలకు మంత్రివర్గంలో ఆమోదం పొందేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews EmergencyResponse Geopolitics Government India IndiaNews LawAndOrder Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliceInvestigation PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















