ఆహార కల్తీల నియంత్రణకు కేంద్రం ఆధునిక వనరులు అందించినా, రాష్ట్రంలో వాటి వినియోగం లేక నిర్లక్ష్యం కొనసాగుతోంది. తిరుపతి, గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం జోన్లకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నాలుగు ‘Food Safety on Wheels’ సంచార ప్రయోగశాలలు గత ప్రభుత్వం హయాంలో 2024 మార్చిలో రాష్ట్రానికి చేరినా ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.
ఈ వాహనాలకు ఇంకా రిజిస్ట్రేషన్ చేయకపోవడం, డ్రైవర్, ఆహార నాణ్యత నిపుణుడు, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించకపోవడం వంటి కారణాలతో అవి నిరుపయోగంగా మారాయి. ఇంధనం, నిర్వహణకు నిధులు లేకపోవడంతో కోట్ల విలువైన ఈ మొబైల్ ల్యాబ్‌లు నిలిచిపోయాయి.ఆహార భద్రత, ప్రమాణాల విభాగం (IPM)లో పర్యవేక్షణ లోపం వల్ల కల్తీల నియంత్రణ బలహీనంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విభాగంలో 579 ఖాళీలు ఉండటంతో పని సామర్థ్యం తగ్గిపోయిందని తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం ప్రతి ఫుడ్ సేఫ్టీ అధికారి ఏడాదికి 144 నమూనాలు సేకరించాల్సి ఉండగా, చాలా తక్కువ మంది మాత్రమే లక్ష్యాన్ని చేరుకుంటున్నట్లు సమాచారం. రాష్ట్రంలో నమూనా పరీక్షల నాణ్యత 8% కంటే తక్కువగా ఉండగా, జాతీయ స్థాయిలో ఇది 22% వరకు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కల్తీలను నియంత్రించేందుకు ఉన్న వనరులను సక్రమంగా వినియోగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















